మున్సిపాల్టీలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-12-16T00:46:16+05:30 IST

బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దాదాపుగా అన్ని కాలనీల్లో పైపులైన్‌ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయని మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి అన్నారు.

మున్సిపాల్టీలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం

సరూర్‌నగర్‌, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దాదాపుగా అన్ని కాలనీల్లో పైపులైన్‌ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయని మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి అన్నారు. గురువారం కార్యాలయంలోని హాల్‌లో మేయర్‌ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో రూ.10.65కోట్లకు సంబంధించిన అంశాలతో కూడిన ఎజెండాను మేనేజర్‌ నాగేశ్‌ ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించి ఏకగ్రీవం గా ఆమోదం తెలిపారు. అనంతరం తమ డివిజన్లలోని ప్రధాన సమస్యలను కార్పొరేటర్లు సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా కాలనీల్లో తగినంతగా తాగునీరు సరఫరా కావడంలేదని, అనేక చోట్ల పైపులైన్ల నిర్మాణం చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వేసవినాటికి పరిస్థితి మెరుగు పడకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ పారిజాతారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్‌ పనులు చేపట్టామని, ఆయా పనులన్నీ పూర్తయితే తాగునీటి సమస్య దాదాపుగా దూరమవుతుందని అన్నారు. మునిసిపల్‌ అధికారులు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి సమ స్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ టి.కృష్ణమోహన్‌రెడ్డి, డీఈఈలు అశోక్‌రెడ్డి, జ్యోతి, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:46:18+05:30 IST