Dr Thejo Kumari: బహుముఖ ప్రజ్ఞాశాలి.. డాక్టర్ తేజో కుమారి
ABN , First Publish Date - 2022-12-01T17:01:30+05:30 IST
చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిలో డాక్టర్ తేజో కుమారి ఆముదాల ఒకరు. సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా, ప్రపంచ
హైదరాబాద్: చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిలో డాక్టర్ తేజో కుమారి ఆముదాల ఒకరు. సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా, ప్రపంచ శాంతిదూతగా, మిసెస్ యూనివర్స్‌గా, రచయిత్రిగా.. ఇలా పలు రంగాల్లో ఆమె ఖ్యాతికెక్కారు. సామాజిక రంగంలో ఆమె అందిస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ‘రియల్ సూపర్ విమెన్ అవార్డు’, ‘సూపర్ విమెన్ సోషల్ ఎంటర్‌ప్రన్యూర్ అవార్డు’, ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డు’, ‘మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ విమెన్ ఫ్రం ఇండియా అవార్డు’, ‘గ్లోబల్ ఐరన్ లేడీ అవార్డు’, ‘పవర్‌ఫుల్ ఉమెన్ అవార్డు’, ‘ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు’, ‘ఇండియన్ గ్లోరీ అవార్డు’, ‘ఝాన్సీ లక్ష్మీబాయి క్వీన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అవార్డు’, ‘నెల్సన్ మండేలాబెల్ శాంతి అవార్డు’, ‘మహాత్మా గాంధీ శాంతి అవార్డు’, ‘నారీ సమ్మాన్ అవార్డు’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అవార్డుల లిస్టు చాలానే ఉంది. ఇటీవల ఆమె జవహర్‌లాల్ నెహ్రూ గ్లోబల్ పీస్ అవార్డు, ఇందిరా గాంధీ సేవారత్న అవార్డు-2022 అందుకున్నారు. డాక్టర్ తేజో కుమారి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. తిరుపతిలో జన్మించారు. తల్లిదండ్రులు ఆముదాల మునివెంకటేశ్వర్లు, తల్లి కిన్నరె ప్రమీలా దేవి.
డాక్టర్ తేజో కుమారి అడుగుపెట్టని రంగమే లేదు. ఎప్పుడూ ప్రజలతో మమేకం కావడం, అణగారిన వర్గాల వారికి అవగాహన కల్పించడం, వారి అవసరాలు తీర్చడం వంటివి చేస్తూ వారికి దగ్గరయ్యారు. సమాజంలో అత్యుత్తమంగా ఉంటూనే, ఉదారంగా ఉండటం సవాలుతో కూడుకున్నదే. అయితే, తేజోకుమారి మాత్రం అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ తనను తాను నిరూపించుకున్నారు. ఆమె చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డు-2022 కూడా అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.