అధికారం కోసం అడ్డదారులు తొక్కం

ABN , First Publish Date - 2022-11-21T03:33:46+05:30 IST

8 తెలంగాణలో పాలనా పీఠమే లక్ష్యం: సంజయ్‌ 8 2023లో రాష్ట్రంలో మార్పు తథ్యం : కిషన్‌రెడ్డి 8 బీజేపీ రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ శిబిరం ప్రారంభం హైదరాబాద్‌/మేడ్చల్‌/కోదాడ/మునగాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తమ పార్టీ విధానం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ‘‘అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాళ్లం.. పార్లమెంటులో విశ్వాస పరీక్షలో ఇద్దరు ఎంపీలు వచ్చేందుకు సిద్ధపడ్డా, వాజ్‌పేయి ఒప్పుకోలేదు.. అడ్డదారిలో వెళ్లకుండా ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజల్లోకి వెళ్లారు. ఏకాత్మ మానవతావాదం మా పార్టీ మూల సిద్ధాంతం. ఆలస్యమైనా దీని ద్వారానే తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం’’ అని ప్రకటించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం ప్రారంభమైన పార్టీ రాష్ట్రస్థాయి ప్రశిక్షణ శిబిరంలో సంజయ్‌ మాట్లాడారు. మండల, జిల్లా స్థాయిలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించుకుంటూ, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రశిక్షణ లక్ష్యమని ఆయన చెప్పారు. ఎవరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ప్రలోభాలు పెట్టినా 2023లో రాష్ట్రంలో మార్పు తథ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ గెలవాలని టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా కోరుకుంటోందని తెలిపారు. పేదలకు కేంద్ర పథకాలు నేరుగా అందుతుండగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు మాత్రం బ్రోకర్ల ద్వారా అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో త్వరలో హైదరాబాద్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని ప్రకటించారు. ఈ శిబిరంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌, ఎంపీలు అర్వింద్‌, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, జాతీయ కార్యవర్గసభ్యులు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డితో పాటు రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: ఈటల ప్రజలు కట్టే పన్నులతో అమలు చేసే రైతుబంధు పథకం డబ్బు తనకు, సీఎం కేసీఆర్‌కు ఎందుకని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. పేదల వద్ద పన్నులు వసూలు చేసి రైతుబంఽధు పేరుతో సంపన్నులకు దోచిపెట్టడం ఎందుకని నిలదీశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఈటల విలేకరులతో మాట్లాడారు. డబ్బులు, ప్రభుత్వ పథకాలు, పదవులు ఆశ చూపి ప్రతిపక్ష నేతలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఫాంహౌస్‌ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను 25 రోజుల పాటు ప్రగతి భవన్‌లో ఎందుకు దాచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మునగాలలో ఈ నెల 12న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి కుటుంబాలు, క్షతగాత్రులను ఈటల పరామర్శించారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయి, 27 మంది గాయాలపాలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు కార్పొరేట్‌ వైద్యం అందించి, వారు కోలుకునే వరకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున ఈటల అందించారు. రేసింగ్‌ పేరుతో ఇబ్బంది కలిగిస్తారా..? హైదరాబాద్‌ నడిబొడ్డున కార్‌ రేస్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించడాన్ని బండి సంజయ్‌ ఒక ప్రకటనలో ఖండించారు. రేస్‌ కోసం సెక్రెటేరియట్‌, ఐమ్యాక్స్‌ నెక్లెస్‌ రోడ్డు పరిసరాలను దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్కడ ట్రాఫిక్‌ జాం ఏర్పడి అంబులెన్సులు చిక్కుకుపోయాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు నగర శివార్లలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని, అక్కడ రేసులు నిర్వహించుకోవాలని సలహా ఇచ్చారు. రేసింగ్‌కు బీజేపీ వ్యతిరేకం కాదని, అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్‌ నిర్వహించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

అధికారం కోసం అడ్డదారులు తొక్కం

తెలంగాణలో పాలనా పీఠమే లక్ష్యం: సంజయ్‌

2023లో రాష్ట్రంలో మార్పు తథ్యం : కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ శిబిరం ప్రారంభం

హైదరాబాద్‌/మేడ్చల్‌/కోదాడ/మునగాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తమ పార్టీ విధానం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ‘‘అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాళ్లం.. పార్లమెంటులో విశ్వాస పరీక్షలో ఇద్దరు ఎంపీలు వచ్చేందుకు సిద్ధపడ్డా, వాజ్‌పేయి ఒప్పుకోలేదు.. అడ్డదారిలో వెళ్లకుండా ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజల్లోకి వెళ్లారు. ఏకాత్మ మానవతావాదం మా పార్టీ మూల సిద్ధాంతం. ఆలస్యమైనా దీని ద్వారానే తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం’’ అని ప్రకటించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం ప్రారంభమైన పార్టీ రాష్ట్రస్థాయి ప్రశిక్షణ శిబిరంలో సంజయ్‌ మాట్లాడారు. మండల, జిల్లా స్థాయిలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించుకుంటూ, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రశిక్షణ లక్ష్యమని ఆయన చెప్పారు. ఎవరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ప్రలోభాలు పెట్టినా 2023లో రాష్ట్రంలో మార్పు తథ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ గెలవాలని టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా కోరుకుంటోందని తెలిపారు. పేదలకు కేంద్ర పథకాలు నేరుగా అందుతుండగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు మాత్రం బ్రోకర్ల ద్వారా అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో త్వరలో హైదరాబాద్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని ప్రకటించారు. ఈ శిబిరంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌, ఎంపీలు అర్వింద్‌, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, జాతీయ కార్యవర్గసభ్యులు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డితో పాటు రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: ఈటల

ప్రజలు కట్టే పన్నులతో అమలు చేసే రైతుబంధు పథకం డబ్బు తనకు, సీఎం కేసీఆర్‌కు ఎందుకని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. పేదల వద్ద పన్నులు వసూలు చేసి రైతుబంఽధు పేరుతో సంపన్నులకు దోచిపెట్టడం ఎందుకని నిలదీశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఈటల విలేకరులతో మాట్లాడారు. డబ్బులు, ప్రభుత్వ పథకాలు, పదవులు ఆశ చూపి ప్రతిపక్ష నేతలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఫాంహౌస్‌ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను 25 రోజుల పాటు ప్రగతి భవన్‌లో ఎందుకు దాచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మునగాలలో ఈ నెల 12న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి కుటుంబాలు, క్షతగాత్రులను ఈటల పరామర్శించారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయి, 27 మంది గాయాలపాలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు కార్పొరేట్‌ వైద్యం అందించి, వారు కోలుకునే వరకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున ఈటల అందించారు.

రేసింగ్‌ పేరుతో ఇబ్బంది కలిగిస్తారా..?

హైదరాబాద్‌ నడిబొడ్డున కార్‌ రేస్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించడాన్ని బండి సంజయ్‌ ఒక ప్రకటనలో ఖండించారు. రేస్‌ కోసం సెక్రెటేరియట్‌, ఐమ్యాక్స్‌ నెక్లెస్‌ రోడ్డు పరిసరాలను దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్కడ ట్రాఫిక్‌ జాం ఏర్పడి అంబులెన్సులు చిక్కుకుపోయాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు నగర శివార్లలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని, అక్కడ రేసులు నిర్వహించుకోవాలని సలహా ఇచ్చారు. రేసింగ్‌కు బీజేపీ వ్యతిరేకం కాదని, అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్‌ నిర్వహించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

Updated Date - 2022-11-21T03:34:03+05:30 IST

Read more