దారుణం : వీధి కుక్కతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-02-11T19:13:36+05:30 IST

వీధి కుక్క పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ గుర్తు తెలియని వ్యక్తిపై నల్లకుంట పీఎస్‌లో కేసు నమోదైంది...

దారుణం : వీధి కుక్కతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : వీధి కుక్క పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ గుర్తు తెలియని వ్యక్తిపై నల్లకుంట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లకుంట సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట నర్సింహబస్తీలో (60) ఏళ్ల వయసు గల వ్యక్తి వీధి కుక్క ప్రైవేట్‌ భాగంలో చేతితో అసభ్యకరంగా నిమురుతుండగా తీసిన వీడియోను ఒకరు ఈ నెల 6న వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియో చూసిన నల్లకుంట బృందావన్‌ కాలనీకి చెందిన యానిమల్‌ ప్రొటక్షన్‌ సభ్యుడు, జంతు ప్రేమికుడు పన్నీర్‌ తేజ వెంటనే నర్సింహబస్తీకి వెళ్లి ఆ వీధి కుక్కకు ప్రథమ చికిత్స చేయించారు.  సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం  నల్లకుంట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా  దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-11T19:13:36+05:30 IST