నిధులు దారి మళ్లించడం అన్యాయం: రంగరావు

ABN , First Publish Date - 2022-12-31T03:53:46+05:30 IST

కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించడం అన్యాయమని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా కార్యదర్శి పోటు రంగారావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిధులు దారి మళ్లించడం అన్యాయం: రంగరావు

హైదరాబాద్‌/బషీరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించడం అన్యాయమని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా కార్యదర్శి పోటు రంగారావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచ్‌ల ఉద్యమానికి తాము మద్దతుగా నిలుస్తామని తెలిపారు. కాగా, కేంద్రం పంచాయతీలకు విడుదల చేసిన 15 ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం సరికాదంటూ వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్పంచుల సంఘం మండలాధ్యక్షురాలు పూడూరు ప్రియాంక ఆధ్వర్యంలో బషీరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వం పంచాయతీల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

Updated Date - 2022-12-31T03:54:03+05:30 IST