పబ్‌లో ఫుల్‌ సౌండ్‌..హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

ABN , First Publish Date - 2022-10-03T17:22:02+05:30 IST

రాత్రి పది దాటిన తర్వాత సంగీతం వినిపించాదన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రెండు పబ్‌లపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్‌ను పురస్కరించుకొని

పబ్‌లో ఫుల్‌ సౌండ్‌..హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

రెండింటిపై కేసులు 

హైదరాబాద్/బంజారాహిల్స్‌: రాత్రి పది దాటిన తర్వాత సంగీతం వినిపించాదన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రెండు పబ్‌లపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్‌ను పురస్కరించుకొని వినియోగదారులను ఆకట్టుకునేందుకు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి వరకు పబ్‌లు సంగీతం హోరెత్తిస్తూ  శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం రాత్రి రెండు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని క్లబ్‌ రోగ్‌లో విపరీతమైన శబ్దాలు వినిపించాయి. దీంతో పబ్‌ మేనేజర్‌ మంగళగిరి రవీందర్‌జీని అదుపులోకి తీసుకున్నారు. ఇదే రోడ్డులో ఉన్న రిపీట్‌ అండ్‌ రివాల్ట్‌ పబ్‌ కూడా నిబంధనలను ఉల్లఘించినట్టు గుర్తించారు. పబ్‌ మేనేజర్‌ మహ్మద్‌ అబ్రార్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more