హైదరాబాద్‌లో గౌరి సిగ్నేచర్ యునిక్ కలెక్షన్స్..

ABN , First Publish Date - 2022-03-15T19:15:28+05:30 IST

భాగ్యనగరంలో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

హైదరాబాద్‌లో గౌరి సిగ్నేచర్ యునిక్ కలెక్షన్స్..

హైదరాబాద్‌ : భాగ్యనగరంలో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్‌ను రామానుజ జీయర్ స్వామిజీ తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు, భారతదేశంలోనే అని కార్ఫ్ట్ రకాల పట్టు శారీలు ఓకే ఒక వేదిక  గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన విలక్షణమైన పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు హైదరాబాద్ వస్త్ర అభిమానులకు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అందుబాటులోకి తెచ్చింది. మగువల మనసులు దోచే పట్టు వస్త్రాలను అందుబాటు ధరలకే  విక్రయించేందుకుగాను గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ హైదరాబాద్‌లోని రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు.


షోరూం ప్రతినిధులు ఉదయ్ సాయి, హరి రాజు మాట్లాడుతూ.. గౌరి సిగ్నేచర్‌లో యునిక్ కలెక్షన్స్  స్వచ్ఛమైన ఒరిజినల్ పట్టు వస్త్రాలను అందరికి అందుబాటు ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ప్లాస్టిక్ ఎక్కడ వాడకుండా వచ్చిన ప్రతి కస్టమర్‌కి క్లాత్ బ్యాగ్స్‌లో, పేపర్, వుడ్ వాటితో అందిస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ ఎక్కడికి  వెళ్లకుండా.. మన హైదరాబాద్‌లోనే ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి, ఫ్యూషన్ శారీస్ ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్‌లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అన్ని వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాలు అందుబాటు ధరలకే అందిస్తున్నామని ఈ చక్కటి అవకాశాన్ని హైదరాబాద్ ప్రాంతవాసులు వినియోగించుకోగలరని నిర్వాహకులు తెలిపారు.



Updated Date - 2022-03-15T19:15:28+05:30 IST