అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-12-16T23:52:15+05:30 IST

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ డ్రగ్స్‌ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో ఓ కార్మికుడు మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి

జీడిమెట్ల, డిసెంబర్‌ 16(ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ డ్రగ్స్‌ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఒడిస్సా రాష్ట్రం, కాలికోట్‌ గంజాం సమీపంలోని తలపడ గ్రామానికి చెందిన అభినహక్‌ కుమారుడు సుఽధీర్‌కుమార్‌ నహక్‌(23) జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ డ్రగ్స్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్‌కుమార్‌ నహక్‌ మృతి చెందినట్టు డాక్టర్‌లు నిర్ధారించారు. కంపెనీ యాజమాన్యం మాత్రం కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడని పేర్కొంది. కంపెనీలో విషవాయువులు పీల్చి మృతి చెంది ఉంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:52:17+05:30 IST