ఓయూలో సివిల్స్‌ అకాడమీ ప్రారంభించిన సీఎస్‌

ABN , First Publish Date - 2022-12-15T03:37:04+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాణించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆకాంక్షించారు.

ఓయూలో సివిల్స్‌ అకాడమీ ప్రారంభించిన సీఎస్‌

తార్నాక, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాణించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆకాంక్షించారు. బుధవారం ఓయూలో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవటానికి అకాడమీ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రంథాలయం, వైఫై సదుపాయాలు కల్పించాలని వర్సిటీ అధికారులను కోరారు.

Updated Date - 2022-12-15T03:37:05+05:30 IST