అదుపు తప్పి కారు బోల్తా

ABN , First Publish Date - 2022-09-19T06:05:57+05:30 IST

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.

అదుపు తప్పి కారు బోల్తా

 ఒకరికి గాయాలు

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. బంజారాహిల్స్‌కు చెందిన చిరాగ్‌ శనివారం అర్ధరాత్రి కారులో జూబ్లీహిల్స్‌ వైపు వెళ్తున్నాడు. రోడ్డు నెంబర్‌ 12 వద్దకు వెళ్లగానే అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. గాల్లోకి లేచి పల్టీలు కొట్టి బోల్తాపడింది. స్థానికులు అక్కడికి చేరుకొని డ్రైవింగ్‌ సీటులో ఉన్న చిరాగ్‌ను బయటకు తీశారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Read more