గో వధను నిషేధించాలి: VHP
ABN , First Publish Date - 2022-07-08T22:56:32+05:30 IST
Hyderabad: గో వధను నిషేధించాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ ఎం మహీందర్ రెడ్డిని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వేలాది గోవులను తరలింగే
Hyderabad: గో వధను నిషేధించాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ ఎం మహీందర్ రెడ్డిని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వేలాది గోవులను తరలింగే అవకాశం ఉన్నందున, ప్రతి చెక్‌పోస్టు వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గోవుల అక్రమ రవాణా అరికట్టి, 1977 గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరడంతో డీజీపీ సానుకూలంగా స్పందించారని వీహెచ్‌పీ నాయకులు తెలిపారు.