వివిధ కారణాల వల్ల తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం: కేంద్రం
ABN , First Publish Date - 2022-12-16T00:35:52+05:30 IST
‘రాష్ట్రంలో చేపట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వివిధ కారణాల వల్ల 31 నెలలు ఆలస్యంగా జరిగాయి. ఈ ప్లాంట్‌పై ఇప్పటి వరకు రూ.10997.7 కోట్లు ఖర్చు చేశాం’’ అని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి
‘‘రాష్ట్రంలో చేపట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వివిధ కారణాల వల్ల 31 నెలలు ఆలస్యంగా జరిగాయి. ఈ ప్లాంట్‌పై ఇప్పటి వరకు రూ.10997.7 కోట్లు ఖర్చు చేశాం’’ అని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోతు కవిత, జి. రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గురువారం సమాధానం ఇచ్చారు. ప్లాంట్ యూనిట్ - 1 నిర్మాణం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ వల్ల ఇసుక లభ్యం కాకపోవడం, పర్యావరణ అనుమతుల్లో ఎన్జీటీ షరతులు, కరోనా వంటి తదితర కారణాల వల్ల ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.