రాజ్యాంగబద్ధంగా మోదీ పాలన
ABN , First Publish Date - 2022-12-07T03:36:15+05:30 IST
కేంద్రంలో ప్రధాని మోదీ పాలన రాజ్యాంగబద్ధంగా నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
‘పంచతీర్థ’గా అంబేడ్కర్ స్థలాల అభివృద్ధి: కిషన్‌రెడ్డి
పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి: గద్దర్
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం తిరిగిపెట్టాలి: వీహెచ్
అంబేడ్కర్‌కు నేతలు, ప్రజాసంఘాల నివాళులు
కవాడిగూడ, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి ): కేంద్రంలో ప్రధాని మోదీ పాలన రాజ్యాంగబద్ధంగా నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలన్నింటినీ పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆయా స్థలాలను సందర్శించడానికి పంచతీర్థ పేరుతోనే ఏప్రిల్ 14న(అంబేడ్కర్ జయంతి) కొత్త రైలును కూడా ప్రారంభిస్తామన్నారు. మంగళవారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిషన్‌రెడ్డితోపాటు ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, పలు పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని, ఇందుకోసం తెలంగాణ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని గద్దర్ అన్నారు. 2019లో పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని వెంటనే మళ్లీ అక్కడే ఏర్పాటు చేయాలని వి.హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర రెండు గంటల పాటు ఆయన మౌనదీక్ష చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ‘ఽభారత రాజ్యాంగం-సవాళ్లు’ అనే అంశంపై పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్మారక ఉపన్యాసం నిర్వహించారు. కాగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్, తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వరం్యలో గాంధీభవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.