TS News: కాళ్ళు మొక్కి ఓటు అడిగేలా హస్తం పార్టీ ఎన్నికల ప్రచారం..
ABN , First Publish Date - 2022-08-19T23:28:25+05:30 IST
Hyderabad: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి హస్తం పార్టీ రెడీ అవుతోంది. వంద రోజుల ప్రచార ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపుతోంది. నియోజకవర్గంలో అన్ని

Hyderabad: మునుగోడు (Munugodu) నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి హస్తం పార్టీ (Congress Party) రెడీ అవుతోంది. వంద రోజుల ప్రచార ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపుతోంది. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించాలని, ప్రతి ఇంటికి పండ్ల బుట్ట పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. భారీగా పార్టీ స్టిక్కర్లు .. కరపత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా ప్రచారంలోకి దిగుతున్నారు. నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తాండా నుంచి ఆయన ప్రచారం మొదలపెట్టనున్నారు. వినూత్న తరహా ఎన్నికల ప్రచారం ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. నియోజకవర్గంలో లక్ష మందికి కాళ్ళు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళిక రచించారు. ప్రతి గ్రామానికి ఐదుగురు చొప్పున ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ఓటరు కాళ్ళు మొక్కి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.