Uttam kumarreddy: మునుగోడు కాంగ్రెస్కు బలమైన నియోజక వర్గం
ABN , First Publish Date - 2022-08-15T17:34:09+05:30 IST
మునుగోడు కాంగ్రెస్కు బలమైన నియోజక వర్గమని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ (Congress)కు బలమైన నియోజక వర్గమని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు నియోజకవర్గం (Munugodu Constituency)లో హుజూరాబాద్ (Huzurabad) లాంటి పరిస్థితి ఉండదని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy)తో కార్యకర్తలు ఎవరూ వెళ్లడానికి సుముఖంగా లేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మునుగోడులో సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొరపాటు చేస్తున్నావని తాను స్వయంగా రాజగోపాల్ రెడ్డికి చెప్పినట్లు తెలిపారు. దళిత బంధు (Dalit bhandu)పేరుతో టీఎర్ఎస్ (TRS) నేతలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. టీఎర్ఎస్ను, కేసీఆర్ (KCR)ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరం ఐక్యంగా ఉన్నామని.... చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ సర్దుకుంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.