కానిస్టేబుళ్లకు సత్కారం

ABN , First Publish Date - 2022-11-24T00:39:08+05:30 IST

మతిస్థిమితం లేని ఓ వ్యక్తి విద్యుత్‌ షాక్‌కు గురై విలవిల కొట్టుకుంటుండగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అతన్ని కాపాడిన కానిస్టేబుళ్ల ధైర్య సాహాసాలు గొప్పవని ఇమ్లిబన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బి.సునీతా నాయుడు, వై.రేణుక, సి.ఇందిరా రాణి పేర్కొన్నారు.

కానిస్టేబుళ్లకు సత్కారం

అఫ్జల్‌గంజ్‌, నవంబర్‌ 23(ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని ఓ వ్యక్తి విద్యుత్‌ షాక్‌కు గురై విలవిల కొట్టుకుంటుండగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అతన్ని కాపాడిన కానిస్టేబుళ్ల ధైర్య సాహాసాలు గొప్పవని ఇమ్లిబన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బి.సునీతా నాయుడు, వై.రేణుక, సి.ఇందిరా రాణి పేర్కొన్నారు. బుధవారం బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ నరసింహ రాజు, కానిస్టేబుళ్లు శంకర్‌, సాయి మనోహర్‌ను ఇమ్లిబన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బి.సునీతా నాయుడు నేతృత్వంలో సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:39:08+05:30 IST

Read more