సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-07-03T01:28:57+05:30 IST

Hyderabad: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి: Bandi Sanjay

Hyderabad:  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది.

‘‘గౌరవప్రద రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్ అగౌరపరుస్తున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఆ హోదాను తగ్గించేలా కేసీఆర్ వ్యవహారం ఉంది. కేసీఆర్ తీరు వల్లే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి. మైనర్లు, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ కంట్రోల్ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ రైతులను వదిలి.. పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేయటం దారుణం. కేసీఆర్ దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. తన ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కేసీఆర్ చూసుకోవాలి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారు. తెలంగాణకు ప్రధాని రావటంతో.. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది. కేసీఆర్‌ది తెలంగాణ రక్తమైతే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలి.’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు. 

Read more