TS News: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ దంపతులు

ABN , First Publish Date - 2022-12-12T12:22:54+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు సోమవారం ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. సర్దార్‌పటేల్ మార్గ్‌లో నిర్మించిన బీఆర్ఎస్ (BRS) కార్యాలయాన్ని బుధవారం (14వ తేదీ) కేసీఆర్ ప్రారంభించనున్నారు.

TS News: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ దంపతులు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు సోమవారం ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. సర్దార్‌పటేల్ మార్గ్‌లో నిర్మించిన బీఆర్ఎస్ (BRS) కార్యాలయాన్ని బుధవారం (14వ తేదీ) కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు రెండు రోజులపాటు ఢిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర

కార్యాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, యాగం ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పరిశీలించారు. కాగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-12T12:22:54+05:30 IST

Read more