ఉక్రెయిన్‌ విద్యార్థులకు ప్రభుత్వ సాయం: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-15T21:09:48+05:30 IST

ఉక్రెయిన్‌లో చదువుతున్న 710 మంది విద్యార్థులను తెలంగాణకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌ విద్యార్థులకు ప్రభుత్వ సాయం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న 710 మంది విద్యార్థులను తెలంగాణకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ విద్యార్థులకు ప్రభుత్వ సాయం చేస్తుందని, ఎంత ఖర్చు అయినా భరించి వారి భవిష్యత్‌ తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


అసలు హిజాబ్ వివాదం ఎందుకని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీశారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దేశంలో రాజకీయాలంటే పిక్నిక్‌లా మారాయన్నారు. కేంద్ర అసమర్ధ ఆర్థిక విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆరోపించారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్ర వైఖరి సరిగాలేదన్నారు. రాష్ట్రాల సమైక్యతను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్రం కంటే తెలంగాణ బెటర్‌ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.Updated Date - 2022-03-15T21:09:48+05:30 IST