Banjara Hills: బస్సులో చైన్ స్నాచర్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-10-17T17:14:02+05:30 IST
బస్సులో ప్రయాణికుడిలా నటిస్తూ ఓ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసు స్నాచింగ్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు
హైదరాబాద్/బంజారాహిల్స్: బస్సులో ప్రయాణికుడిలా నటిస్తూ ఓ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసు స్నాచింగ్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అల్మా్‌సగూడకు చెందిన జె.రాజశేఖర్ ఓ చానల్‌లో రిపోర్టర్. ఈనెల 13న ఆర్టీసీ బస్సులో బంజారాహిల్స్ తెలంగాణ భవన్ వరకు వచ్చాడు. ప్రయాణికుడిలా నటించిన వ్యక్తి రాజశేఖర్ మెడలో ఉన్న 40 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హబీబ్‌నగర్, మన్హర్ బస్తీకి చెందిన కె.సన్నీ అని తేలింది. అతన్ని అరెస్టు చేసి, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.