CM KCR's convoyకు అడ్డుగా వెళ్లిన మహిళపై కేసు

ABN , First Publish Date - 2022-09-19T16:18:06+05:30 IST

సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

CM KCR's convoyకు అడ్డుగా వెళ్లిన మహిళపై కేసు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ (CM KCR's convoy)కు అడ్డుగా వెళ్లిన మహిళ (Women)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ (Telangana CM) ప్రగతిభవన్ నుండి రాజ్‌భవన్‌కు వెళ్తున్న మార్గంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఇదే క్రమంలో బెంజ్‌లో కార్‌లో వచ్చిన మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనకు అత్యవసరంగా వెళ్ళే పని ఉందని పంపించాలని కానిస్టేబుల్‌ రాజును మహిళ కోరారు. వీవీఐపీ మూమెంట్ ఉందని మహిళకు కానిస్టేబుల్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వినకుండా కానిస్టేబుల్‌ను మహిళ దుర్భాషలాడారు. ఈ విషయంపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read more