బీజేపీ కార్యకర్తలకు నేడు పండగ రోజు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-04-06T17:56:59+05:30 IST

బీజేపీ కార్యకర్తలకు ఇవాళ పండగ రోజని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

బీజేపీ కార్యకర్తలకు నేడు పండగ రోజు: బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ కార్యకర్తలకు ఇవాళ పండగ రోజని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో అనేక మంది త్యాగాలు ఉన్నాయన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిత్యం పోరాడుతూ చావుకు కూడా వెనుకాడని నైజం బీజేపీ కార్యకర్తలదని అన్నారు. అధికారం కోసం కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వృధా కాలేదని, రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీకి ఇవాళ 300కుపైగా ఎంపీలు ఉన్నారంటే పార్టీ సిద్ధాంతమే కారణమన్నారు. మోదీ, నడ్డా సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత, అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి గ్రామం తిరిగి ఎండగడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-06T17:56:59+05:30 IST