బోర్లు ఫెయిలై.. పత్తి సాగులో నష్టపోయి..

ABN , First Publish Date - 2022-12-31T04:19:00+05:30 IST

అప్పుల బాధ భరించలేక శుక్రవారం రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బోర్లు ఫెయిలై.. పత్తి సాగులో నష్టపోయి..

వేర్వేరు ఘటనల్లో అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

కొల్చారం/గీసుకొండ, డిసెంబరు 30: అప్పుల బాధ భరించలేక శుక్రవారం రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కొంగోడులో మేకల సుధాకర్‌(38) తనకున్న 30 గుంటల భూమిలో బోరు వేసి రూ. 3 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. వ్యవసాయం కలిసిరాక పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోవడంతో పాటు ఇతర ఆర్థిక కారణాలతో తీవ్ర మనస్తాపానికి లోనై ఉరేసుకున్నాడు. గ్రేటర్‌ వరంగల్‌ 15వ డివిజన్‌ మొగిలిచర్లలో గూడూరు కార్తీక్‌(27) ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దిగుబడి లేక పెట్టుబడి కూడా రాలేదు. అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనకు పురుగుల మందు తాగాడు.

Updated Date - 2022-12-31T04:19:01+05:30 IST