22 నుంచి పుస్తక ప్రదర్శన: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ABN , First Publish Date - 2022-12-07T03:59:05+05:30 IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా గుర్తింపు సంపాదించుకుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

22 నుంచి పుస్తక ప్రదర్శన: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా గుర్తింపు సంపాదించుకుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌) స్టేడియంలో నిర్వహించ సంకల్పించిన పుస్తక ప్రదర్శనకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. వెంటనే మంత్రి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వహిస్తుండడం అభినందించాల్సిన విషయమన్నారు.

Updated Date - 2022-12-07T03:59:06+05:30 IST