తెలంగాణ బీజేపీ నేతలతో నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2022-01-16T19:04:48+05:30 IST
తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రాముఖ్యతలను బీజేపీ నేతల నుండి కేంద్రమంత్రి తెలుసుకుంటున్నారు. తెలంగాణకు గిరిజన యూనివ్సిటీ, ఐఐఎం, ఎన్ఐడీ, ఎన్ఐఎస్ఈఆర్ విద్యా సంస్థలను కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2023 ఎన్నికల నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుండి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. వీడియో కాన్ఫరెన్స్లో ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.