కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-03-08T17:17:32+05:30 IST

నగరంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్: నగరంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కర్మన్‌ఘాట్‌లో గోరక్షకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. గోరక్షకులకు భరోసా కల్పించేందుకు కర్మన్ ఘాట్‌లో బండి సంజయ్  పర్యటిస్తున్నారు. కాసేపట్లో స్థానికంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో  బీజేపీ అధ్యక్షుడు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-03-08T17:17:32+05:30 IST