MMTS Train: బేగంపేటలో ఎంఎంటీఎస్‌కు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-30T15:44:55+05:30 IST

నగరంలోని బేగంపేట స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్‌ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది.

MMTS Train: బేగంపేటలో ఎంఎంటీఎస్‌కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని బేగంపేట స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్‌ ట్రైన్‌(MMTS Train)కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం బేగంపేట్ వద్ద భారీ శబ్దంతో ఎంఎంటీఎస్ రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్రైన్ కుదుపుకు గురైంది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సాంకేతిక సమస్య వల్లే ట్రైన్ నిలిచిపోయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. 

Read more