తెలంగాణలో రెండేళ్లలో 5.76 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలు: కేంద్రం
ABN , First Publish Date - 2022-12-15T03:40:14+05:30 IST
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. రెండేళ్లలో 5.76 లక్షల మంది ఈ పథకం కింద వైద్య సేవలు పొందారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈమేరకు పార్లమెంట్‌లో ఆయుష్మాన్ లబ్ధిదారులు, ఆయా రాష్ట్రాలకు ఆ స్కీమ్ కింద కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో 2021 నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతోంది. ఆ ఏడాది రాష్ట్రానికి రూ.150 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 26 లక్షల మంది ఆయుష్మాన్ పథకానికి అర్హులు. ఈ కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంది. ఇక ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 83.94 లక్షల మంది వైద్య సేవలు పొందినట్లు కేంద్రం తెలిపింది.