TS News.. హైదరాబాద్: నేరెడ్‌మెట్‌లో దారుణం

ABN , First Publish Date - 2022-11-08T14:16:24+05:30 IST

హైదరాబాద్: నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకును తీవ్రంగా కొట్టి చంపాడు.

TS News.. హైదరాబాద్: నేరెడ్‌మెట్‌లో దారుణం

హైదరాబాద్: నేరెడ్‌మెట్‌

పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకును తీవ్రంగా కొట్టి చంపాడు. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నేరెడ్‌మెట్ జేజేనగర్‌కు చెందిన సుధాకర్, దివ్య 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. సుధాకర్ ఓ అపార్టు‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా సుధాకర్ తాగుడుకు బానిస అయ్యాడు. కొడుకు జీవన్ ఏడుస్తుండడంతో సహనం కోల్పోయిన తండ్రి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుడు పరిస్థితిని గమనించిన తల్లి దివ్య హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఘటనపై దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-08T14:16:29+05:30 IST