AP News: టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు..

ABN , First Publish Date - 2022-10-01T21:17:53+05:30 IST

చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది.

AP News: టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు..

హైదరాబాద్ (Hyderabad): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ (Chintakayala Vijay) ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వచ్చారో.. కేసు ఏంటో కూడా పోలీసులు చెప్పలేదు. ఇంట్లో పిల్లలు ఉన్న సమయంలో పోలీసులు రావడం.. అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు వాపోయారు.


చింతకాయల విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటారు. ఐటీడీపీ కో కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఐటీడీపీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేశారని పోలీసుల అభియోగంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం సీఐడీ పోలీసులు విజయ్ ఇంటి దగ్గరలోనే ఉన్నట్లు సమాచారం. దీనిపై టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఏదైనా కేసు ఉంటే నిబంధనల ప్రకారం పోలీసులు నడుచుకోవాలని, అలా కాకుండా విజయ్‌ని ఎలా అదుపులోకి తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా బయట పెట్టకుండా నేరుగా పోలీసులు ఇంటికి వెళ్లి హల్ చల్ చేయడం సరికాదన్నారు.

Read more