విద్యా వ్యవస్థలను ప్రభుత్వం గాలికొదిలేసింది
ABN , First Publish Date - 2022-08-04T06:01:38+05:30 IST
తెలంగాణలో విద్యా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ ఆరోపించారు.
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అరెస్ట్
బేగంపేట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వ అలసత్యం, అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆమె ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్‌కు తరలించారు. ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్‌పాయిజన్ నిత్యకృత్యంగా మారిందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు వారికి ప్రాణ సంకటంగా మారాయన్నారు. హాస్టళ్లలో సమస్యలు పెరిగాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం.. కనీసం సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందన్నారు. ఆప్ నేతలు సుధాకర్, అబ్దుల్ ముక్తదదిర్, ఎండీ మాజీద్, సర్దార్ రణదీర్‌సింగ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.