వైభవంగా పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2022-12-16T00:42:20+05:30 IST

చిక్కడపల్లి, డిసెంబర్‌15(ఆంధ్రజ్యోతి): బాలు-వంశీ శుభోదయం పురస్కారాల ప్రదానోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, గాయకులు కె రామాచారి, కళాపోషకుడు పొత్తూరి రంగారావుకు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పురస్కారాలను అందజేశారు. బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లో పాట పాడడం ప్రారంభించి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అభినందనీయమన్నారు.త్యాగరాయగానసభ వంశీ ఇంటర్నేషనల్‌, లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వంశీ రామరాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఘంటసాల పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో బంగారు పతకం ఏర్పాటు చేశామన్నారు. బాలు పేరుతో వేరే విశ్వవిద్యాలయంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ రామాచారి శిష్యబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సుచిత్ర వ్యాఖ్యానం చేసిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు కామేశ్వరి, శైలజ, డాక్టర్‌ తెన్నేటి సుధ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి నుంచి పురస్కారాలు అందుకున్న పట్నాయక్‌, రామాచారి, రంగారావు

 వైభవంగా పురస్కారాల ప్రదానం
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి నుంచి పురస్కారాలు అందుకున్న పట్నాయక్‌, రామాచారి, రంగారావు

వైభవంగా పురస్కారాల ప్రదానం

చిక్కడపల్లి, డిసెంబర్‌15(ఆంధ్రజ్యోతి): బాలు-వంశీ శుభోదయం పురస్కారాల ప్రదానోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, గాయకులు కె రామాచారి, కళాపోషకుడు పొత్తూరి రంగారావుకు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పురస్కారాలను అందజేశారు. బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లో పాట పాడడం ప్రారంభించి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అభినందనీయమన్నారు.త్యాగరాయగానసభ వంశీ ఇంటర్నేషనల్‌, లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వంశీ రామరాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఘంటసాల పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో బంగారు పతకం ఏర్పాటు చేశామన్నారు. బాలు పేరుతో వేరే విశ్వవిద్యాలయంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. లిటిల్‌ మ్యూజిక్‌ అకాడమీ రామాచారి శిష్యబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సుచిత్ర వ్యాఖ్యానం చేసిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు కామేశ్వరి, శైలజ, డాక్టర్‌ తెన్నేటి సుధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:42:25+05:30 IST