Hyderabad City: పాదచారుల కోసం94 పెడస్ట్రియన్ సిగ్నల్స్
ABN , First Publish Date - 2022-12-15T12:42:25+05:30 IST
గ్రేటర్‌లో పాదచారుల రక్షణ, భద్రతకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పాదచారులు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో పాదచారుల రక్షణ, భద్రతకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఫుట్‌పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టి వారి భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్‌లో పాదచారుల కోసం 94 పెడస్ర్టియన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు 415 కిలోమీటర్లు ఉన్న ఫుట్‌పాత్‌లను రూ. 32.75 కోట్లతో 817 కిలోమీటర్లకు విస్తరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో 20 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో 22 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను రూ. 76.65 కోట్లతో చేపట్టారు. ఇందులో ఎనిమిది ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి. బంజారాహిల్స్‌లో 3డీ ఎఫెక్ట్‌తో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు.
ఇక్కడే కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు
చెన్నయ్ షాపింగ్ మాల్-మదీనగూడ, యశోద పియరల్ కాంప్లెక్స్-మియాపూర్, హైదరాబాద్ సెంట్రల్ మాల్- పంజాగుట్ట, ఎన్‌ఎ్‌సకేకే స్కూల్ దగ్గర - బాలానగర్, నేరేడ్‌మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్- సికింద్రాబాద్, స్వప్న థియేటర్ - రాజేంద్రనగర్, ఈఏ్‌సఐ ఆస్పత్రి- ఎర్రగడ్డ.
రూ. 31.11 కోట్లతో ఫుట్‌పాత్ పనులు
పాదచారుల భద్రత కోసం రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్థల సమస్యలతో అనుకున్న లక్ష్యం మేరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టలేకపోయాం. తార్నాక, ఏఏఎ్‌సరావునగర్, ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను త్వరలో ప్రారంభిస్తాం. పాదచారుల కోసం ఈ సంవత్సరంలో రూ. 31.11 కోట్లతో ఫుట్‌పాత్ పనులు చేపట్టాం.
- గద్వాల్ విజయలక్ష్మి, మేయర్