‘ధరణి’ నిషేధిత జాబితాలో 8 లక్షల ఎకరాలు
ABN , First Publish Date - 2022-12-07T04:03:04+05:30 IST
పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
న్యాయవాది లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాదాపు 8 లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఈ మేరకు న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను సుమోటో వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. ధరణి నిషేధిత జాబితాలో 8లక్షల ఎకరాలను చేర్చడం వల్ల అవి ప్రభుత్వ భూములుగా వెబ్‌సైట్‌లో చూపుతోందని పిటిషనర్ ఆరోపించారు. మరో 3.84 లక్షల ఎకరాలను అటవీ భూములుగా నమోదు చేశారని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ఆటవీశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏకు కోర్టు నోటీసులు జారీచేసింది.