తెరుచుకున్న విద్యాసంస్థలు.. తొలి రోజు 33.35 శాతమే హాజరు

ABN , First Publish Date - 2022-02-02T12:10:03+05:30 IST

తొలిరోజు జిల్లాలోని 690 ప్రభుత్వ పాఠశాలల్లో 96,039 మంది విద్యార్థుల్లో 36,857 మంది..

తెరుచుకున్న విద్యాసంస్థలు.. తొలి రోజు 33.35 శాతమే హాజరు

హైదరాబాద్‌ సిటీ : నగరంలోని విద్యాసంస్థలు మంగళవారం తెరుచుకున్నాయి. తొలిరోజు జిల్లాలోని 690 ప్రభుత్వ పాఠశాలల్లో 96,039 మంది విద్యార్థుల్లో 36,857 మంది (38.38 శాతం), 245 ఎయిడెడ్‌ స్కూళ్లలో చదువుతున్న 36,782 మందిలో 8,842 (24.04 శాతం) హాజరయ్యారు. 1886 ప్రైవేట్‌ స్కూళ్లలో 1,524 తెరుచుకోగా,  మొత్తం 6,58,631 మంది విద్యార్థుల్లో 2,18,254 (33.14 శాతం) హాజరయ్యారు. మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కలిపి 7,91,452 మందిలో 2,63,953 (33.35 శాతం) హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి నగరంలోని ఏవీ, ఆలియా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరును పరిశీలించారు.

Updated Date - 2022-02-02T12:10:03+05:30 IST