Common Holidays: 2023లో సాధారణ సెలవులు 28

ABN , First Publish Date - 2022-11-17T03:00:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవులను ప్రకటించింది.

Common Holidays: 2023లో సాధారణ సెలవులు 28

ఉత్తర్వులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. 2023 కేలండర్‌ సంవత్సరంలో 28 సాధారణ సెలవులు (జనరల్‌ హాలిడేస్‌), 24 ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్‌ హాలిడేస్‌) ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సెలవు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసి ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో ఐదు ఐచ్ఛిక సెలవులను మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, ఈదుల్‌-మిలాద్‌ పండుగల తేదీల్లో మార్పులుంటాయని, ఆయా సందర్భాల్లో సవరణ ఉత్తర్వులను జారీ చేస్తామని పేర్కొన్నారు. హిందువులు జరుపుకొనే పెద్ద పండుగల్లో సంక్రాంతి జనవరి 15న, దసరా అక్టోబరు 24న, దీపావళి నవంబరు 12న ఉంటాయి. బతుకమ్మ ఉత్సవాలు అక్టోబరు 14న ప్రారంభమవుతాయని తెలిపారు.

5444.jpg

Updated Date - 2022-11-17T12:09:29+05:30 IST