సివిల్స్ మెయిన్స్‌లో 2,529 మంది అర్హత
ABN , First Publish Date - 2022-12-07T03:46:59+05:30 IST
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది
హైదరాబాద్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీల మధ్య జరిగిన మెయిన్స్‌కు దాదాపు 15 వేల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 700 మంది పరీక్ష రాశారు. పోస్టుకు 2.5 చొప్పున 2,529 మందిని పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేశారు. ఈ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది ఇంటర్వ్యూకు వెళ్లే అవకాశం ఉంది. జనవరి 2వ వారంలో ఇంటర్వ్యూలు మొదలయ్యే వీలుంది. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన డి.ప్రవీణ్ (ములుగు), కె.ప్రణయ్ (జనగామ), డి.కిరణ్‌కుమార్ (నిజామాబాద్) సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.