drunk driving: సగటున 250 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-12-16T11:03:13+05:30 IST

మద్యం తాగి వాహనం నడుపుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఒక్క

drunk driving: సగటున 250 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ: మద్యం తాగి వాహనం నడుపుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఒక్క బాలానగర్‌ పోలీసులే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 2,054డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. 181మంది మందుబాబులు జైలుపాలు కాగా, 1,381 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెండ్‌ అయ్యాయి. సైబరాబాద్‌లోని 15 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని ఒక్కో పీఎస్‌లో 8నెలల కాలంలో 2వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ప్రతినెలా సగటున 250కి పైగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా, 200 మంది లైసెన్సులు సస్పెండ్‌ అవుతున్నాయి.

Updated Date - 2022-12-16T11:03:22+05:30 IST