Hyderabad: బాలికపై అఘాయిత్యం కేసులో 20 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-11-25T11:32:06+05:30 IST

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితునికి జైలుశిక్ష, జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక

Hyderabad: బాలికపై అఘాయిత్యం కేసులో 20 ఏళ్ల జైలు

హైదరాబాద్/రంగారెడ్డి: చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితునికి జైలుశిక్ష, జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీష తీర్పునిచ్చారు. ప్రత్యేక అదనపు పీపీ సునీత కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన బాలిక (4) 2016 ఫిబ్రవరి 3న తన సోదరుడితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన కాటం రాజు డబ్బులిస్తానని బాలికకు ఆశచూపాడు. పక్కింటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరుసటిరోజు సైతం అతను అదేవిధంగా ప్రయత్నించడంతో పారిపోయిన చిన్నారి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు దూసరి రాజు అలియాస్‌ కాటం రాజుకు 20 సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ. 20వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - 2022-11-25T11:32:08+05:30 IST