Bank of Maharashtra: బ్యాంకుకు టోకరా..10 మందికి జైలు

ABN , First Publish Date - 2022-11-24T11:34:07+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌లో నిధుల మళ్లింపు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రుణాలు మంజూరు

Bank of Maharashtra: బ్యాంకుకు టోకరా..10 మందికి జైలు

హైదరాబాద్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌లో నిధుల మళ్లింపు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో నేరం రుజువు కావడంతో 10 మంది నిందితులకు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ అప్పటి సీనియర్‌ మేనేజర్‌ జల్లి శరత్‌బాబు, ఇతర బ్యాంకు అధికారులు ప్రైవేటు కంపెనీకి చెందిన వ్యక్తులతో కలిసి కుట్ర చేశారని.. నకిలీ పత్రాలతో రూ. 5 కోట్ల రుణాలు మంజూరు చేశారని పేర్కొంటూ సీబీఐ 2013లో కేసు నమోదు చేసింది. నేరం రుజువు కావడంతో బ్యాంకు అధికారులు జెల్లి శరత్‌బాబు, రాందాసి సుహాస్‌ కళ్యాణ్‌కు ఏడేళ్ల జైలు, రూ.1.10 లక్షల జరిమానా, ప్రైవేటు వ్యక్తులు దొనికెన శ్రీధర్‌, దొనికెన పూర్ణశ్రీ, మారెళ్ల శ్రీనివాస్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు.. రూ. లక్ష చొప్పున జరిమానా, మరో నిందితుడు మారెళ్ల లక్ష్మారెడ్డికి ఏడాది జైలు, రూ.20 వేల జరిమానా, వెంపటి శ్రీనివా్‌సరెడ్డి, వెట్టె రాజారెడ్డి, వడ్డె నర్సయ్య, బాతుల సత్యసూరజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది.

Updated Date - 2022-11-24T11:34:10+05:30 IST