Telangana Govt: నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే రోజు రెండు నోటిఫికేషన్లు

ABN , First Publish Date - 2022-12-30T18:34:08+05:30 IST

నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) శుభ‌వార్త చెప్పింది. నిన్న గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Govt: నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే రోజు రెండు నోటిఫికేషన్లు

హైదరాబాద్: నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) శుభ‌వార్త చెప్పింది. గురువారం గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటలలోపే తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్‌ను (Notification) ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ ఇచ్చారు. తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేశారు. 26 విభాగాల్లో 1,365 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే 5,204 స్టాఫ్‌ నర్సు (Staff Nurse)ల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి (February) 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణలో డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టుల భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ బోర్డు ద్వారా నియామకాలు చేపడుతారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గురువారం ప్రత్యేక నోటిఫికేషన్‌ను(28/2022) జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్‌

డీఎంఈ, డీహెచ్ – 3,823

వైద్య విధాన ప‌రిష‌త్ – 757

బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 197

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్స్ – 127

సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124

ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ – 81

ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 74

తెలంగాణ రెసిడెన్షియ‌ల్స్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్ – 13

డిజ‌బుల్డ్, సినీయ‌ర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8

Updated Date - 2022-12-30T18:37:52+05:30 IST