Munugode By Election: బంగారు తెలంగాణ మోదీ స్వప్నం: తరుణ్‌చుగ్

ABN , First Publish Date - 2022-10-29T16:53:26+05:30 IST

బంగారు తెలంగాణ’ ప్రధాని మోదీ స్వప్నమని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ (Tarun chugh) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతికి కల్వకుంట్ల కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు

Munugode By Election: బంగారు తెలంగాణ మోదీ స్వప్నం: తరుణ్‌చుగ్
Tarun chugh

నల్లగొండ: ‘బంగారు తెలంగాణ’ ప్రధాని మోదీ స్వప్నమని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ (Tarun chugh) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతికి కల్వకుంట్ల కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)కు వ్యతిరేకంగా మునుగోడు తీర్పు రాబోతోందన్నారు. కేసీఆర్ సినిమా స్టోరీలు రాస్తారని విమర్శించారు. మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) పక్కన ఉండేందుకు.. స్వంత పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారని తెలిపారు. ఫామ్‌హౌస్ వ్యవహారమంతా ఓ నాటకమని ఆయన కొట్టిపారేశారు. ఈ వ్యవహారమంతా నకిలీదేనని తోచిపుచ్చారు. ఫిరాయింపుదారులంతా టీఆర్ఎస్‌లోనే ఉన్నారని తప్పుబట్టారు. మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయమని తరుణ్‌చుగ్ జోస్యం చెప్పారు.

Updated Date - 2022-10-29T16:53:28+05:30 IST