యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-05T07:03:45+05:30 IST

పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించేలా అందించే ఉచిత శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఇటీవల ఉచిత శిక్షన కోసం నిర్వహించిన అర్హత పరీక్షల్లో ప్రతిభ సాధించిన 200 మందికి శుక్రవారం నుంచి కోచింగ్‌ను ప్రారంభించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించి అభ్యర్థులు పట్టుదలతో నిరంతరం తరగతులకు హాజరు కావాలని సూచించారు.

యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

పోలీసు ఉద్యోగాల శిక్షణను ప్రారంభించిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, మార్చి 4: పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించేలా అందించే ఉచిత శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఇటీవల ఉచిత శిక్షన కోసం నిర్వహించిన అర్హత పరీక్షల్లో ప్రతిభ సాధించిన 200 మందికి శుక్రవారం నుంచి కోచింగ్‌ను ప్రారంభించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించి అభ్యర్థులు పట్టుదలతో నిరంతరం తరగతులకు హాజరు కావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ త్వరలో పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రానుందన్నారు. ఈ క్రమంలో జిల్లా యువకులను అందులో రాణించేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారని తెలిపారు. అర్హత పరీక్షల్లో 4,500 మంది హాజరెతే 200 మందిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొవిడ్‌ తర్వాత తొలిసారిగా జిల్లాలోనే ముందుగా శిక్షణలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీని కోసం పోలీసు శాఖ ఎంతో శ్రమిస్తుందన్నారు. అభ్యర్థులు తరగతులను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈనికి తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో పోలీసు తరపున ఉచిత కోచంగ్‌ను అందిస్తున్నామని తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ఆర్థిక సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలు రాకపోయిన ఇతర ఏ ఉద్యోగంలోనైనా రాణించేలా కోచింగ్‌ను నిష్ణాతులైన వారిచే కోచింగ్‌ అందిస్తామన్నారు. 60 రోజుల పని దినాల వరకు శిక్షణ ఉంటుందని ఒక్క రోజు రాక పోయిన వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావ్‌, వినోద్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Read more