అధ్వాన్నంగా దాబా రోడ్డు

ABN , First Publish Date - 2022-08-29T04:10:09+05:30 IST

మండలంలోని సవ్వాతి, దాబారోడ్డు అధ్వా న్నంగా తయారైంది. వర్షాలకు తోడు కంకర లోడుతో నిత్యం లారీలు నడుస్తుండడంతో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదక రంగా మారింది.

అధ్వాన్నంగా దాబా రోడ్డు
కంకర తేలి గుంతలు పడ్డ దాబా రోడ్డు

- పట్టించుకోని అధికారులు 

- అవస్థలు పడుతున్న ప్రజలు

వాంకిడి, ఆగస్టు 28: మండలంలోని సవ్వాతి, దాబారోడ్డు అధ్వా న్నంగా తయారైంది. వర్షాలకు తోడు కంకర లోడుతో నిత్యం లారీలు నడుస్తుండడంతో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదక రంగా మారింది. మండల కేంద్రంలో కొనసాగుతున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం మండలంలోని దొడ్డిగూడ గ్రామం వద్ద డీబీఎల్‌ కంపెనీ వారు కంకర క్రషర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు కంకరలోడ్‌తో భారీవాహనాలు రాకపోకలు చేస్తు న్నాయి. అడుగడున రోడ్డుపై గుంతలు ఏర్పడి, కంకర తేలి ద్విచక్ర వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో ప్రమాదవశాత్తు గుంతలో పడినా, కంకరపై జారినా  రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే అనేక మంది వాహనాలు కంకరపై నుంచి జారి కిందపడిన సంఘటనలు న్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోడ్డిగుడ గ్రామం వద్ద ఏర్పాటు చేసి క్రషర్‌ నుంచి వాంకిడి వరకు కంకర తీసుకు వస్తున్న డీబీఎల్‌ ఎంపెనీ యాజమాన్యం రోడ్డు పాడైపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తు న్నారు. ఉన్నతాధికారులు స్పందించి  వాంకిడి నుంచి దోడ్డిగూడ గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని భారీ వాహ నాలు నడవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.   

కంకర లోడ్‌ వాహనాలను నిలిపివేయాలి

- దేవరావు, సర్పంచ్‌, సవ్వాతి

 నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం దోడ్డిగ్రామం వద్ద ఏర్పాటు చేసిన క్రషర్‌ నుంచి ప్రతిరోజు కంకర లోడ్‌తో భారీ వాహ నాలు నడపడంవల్ల రోడ్డు చెడిపోయింది. వాంకిడి నుంచి దోడ్డిగూడ వరకు రోడ్డుపై అడుగుడున గుంతలు పడి, కంకర తేలి అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు మరమ్మతులు చేయాలని డీబీఎల్‌ కంపెనీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవ డంలేదు. తక్షణమే స్పందించకపోతే క్రషర్‌ వద్దనే వాహనాలను అడ్డు కుంటాం. ఉన్నతాధికారులు సర్పందించి వెంటనే రోడ్డు మరమ్మ తులు చేసి కంకరలోడ్‌తో నడుస్తున్న వాహనాలను నిలిపి వేయాలి.

Updated Date - 2022-08-29T04:10:09+05:30 IST