ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం

ABN , First Publish Date - 2022-07-02T04:41:05+05:30 IST

మండలంలోని మొగడ్‌దగడ్‌ ఆశ్రమ పాఠశాలలో శుక్ర వారం అన్నంలో పురుగుల రావడంతో విద్యార్థులు అర్థాకలితో గడిపారు. పాఠ శాల ప్రారంభమై 15రోజులు గడు స్తున్నా మెనూప్రకారం భోజనం వడ్డిం చకుండా మిగిలిన పప్పు, పురుగులు, రాళ్ల అన్నం పెడుతున్నారని విద్యార్థులు అన్నం పడేశారు.

ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం
అన్నంలో వచ్చిన పురుగులు

కౌటాల, జూలై 1: మండలంలోని మొగడ్‌దగడ్‌ ఆశ్రమ పాఠశాలలో శుక్ర వారం అన్నంలో పురుగుల రావడంతో విద్యార్థులు అర్థాకలితో గడిపారు. పాఠ శాల ప్రారంభమై 15రోజులు గడు స్తున్నా మెనూప్రకారం భోజనం వడ్డిం చకుండా మిగిలిన పప్పు, పురుగులు, రాళ్ల అన్నం పెడుతున్నారని విద్యార్థులు అన్నం పడేశారు. విషయం తెలుసు కున్న ఐటీడీఏ డైరెక్టర్‌ మాంతయ్య, నాయకులు దిలీప్‌ పాఠశాలకు వెళ్లి భోజ నాన్ని పరిశీలించారు. భోజనం నాసిరకంగా ఉండడంతో విద్యార్థులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పురుగుల అన్నం తింటున్నారా అని విద్యార్థులను ప్రశ్నించగా రోజు ఇలాంటి భోజనమే చేస్తున్నామని ఆకలి తీర్చుకోవడానికి తప్పడంలేదని పేర్కొన్నారు. ఈవిషయంపై ప్రధానో పాధ్యాయుడిని అడుగగా అన్నంలో పురుగులు రావా అని పేర్కొంటున్నా డని పేర్కొ న్నారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీడీఏ డైరెక్టర్‌ మాంతయ్య విషయాన్ని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి దృష్టికి తీసుకు పోతానని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మొగడ్‌దగడ్‌ పాఠశాలకు అవార్డు వచ్చిందన్నారు. గతంలో 300మంది ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 100, 120కి పడిపోయారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T04:41:05+05:30 IST