మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-06T03:46:47+05:30 IST

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. శనివారం కొల్లూరు, పాలకొల్లు, జనగామ, సిర్సా గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ మహిళా భవ నాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. ఒక్కో భవ నాన్ని రూ.15 లక్షలతో నిర్మిస్తున్నామని, నియోజక వర్గానికి 36 భవనాలు మంజూరు కాగా అందులో అత్యధికంగా కోటపల్లి మండలంలోనే నిర్మిస్తున్నామ న్నారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
మహిళ భవన నిర్మాణ శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సుమన్‌

సమ్మక్క సారలమ్మ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన  

కోటపల్లి, మార్చి 5: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. శనివారం కొల్లూరు, పాలకొల్లు, జనగామ, సిర్సా గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ మహిళా భవ నాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. ఒక్కో భవ నాన్ని రూ.15 లక్షలతో నిర్మిస్తున్నామని, నియోజక వర్గానికి 36 భవనాలు మంజూరు కాగా అందులో అత్యధికంగా కోటపల్లి మండలంలోనే నిర్మిస్తున్నామ న్నారు. మారుమూల ప్రాంతం నుంచి బ్యాంకు లావా దేవీలకు కోటపల్లి, చెన్నూరు వెళ్లాల్సి వస్తుందని, మహిళా భవనాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తేవడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు ఉండవన్నారు. మహిళ సంఘాలు సమావేశాలు నిర్వహించుకుని అభివృద్ధి, పొదుపు, రుణాలు, అంశా లపై తీర్మానాలు చేసుకునే వెసలుబాటు ఉంటుంద న్నారు. సంఘాల సభ్యులకే కంప్యూటర్‌పై శిక్షణ ఇచ్చి నియమిస్తామని, దీని వల్ల ఆన్‌లైన్‌ సేవలు అందు బాటులోకి వస్తాయన్నారు. సమావేశాల్లో డీఆర్‌డీవో శేషాద్రి, జడ్పీ కో ఆప్షన్‌ ఎండీ అస్గర్‌, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, రైతుబంధు కన్వీనర్‌ గుర్రం రాజన్న, సింగిల్‌విండో చైర్మన్‌ సాంబ గౌడ్‌, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు విద్యాసాగర్‌, పార్టీ మం డల అధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో భాస్కర్‌, సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మయ్య,  పాల్గొన్నారు. 

బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన 

మండలంలోని ఏదులబంధం వద్ద తుంతుంగ వాగుపై రూ.8 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పను లను ఎమ్మెల్యే సుమన్‌ పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులకు పలుసూచనలు చేశారు.  వర్షాకాలం ప్రారంభం నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని అందుబాటులోకి తెస్తామని, దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో ఏదులబంధం, సిర్సా, రొయ్యలపల్లి, పుల్లగామ, ఆల్గామ, జనగామ, వెంచపల్లి ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు.  

Updated Date - 2022-03-06T03:46:47+05:30 IST