సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

ABN , First Publish Date - 2022-03-06T03:54:32+05:30 IST

మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తామని ఎంపీపీ రోజారమణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ రోజారమణి అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
మాట్లాడుతున్న ఎంపీపీ రోజారమణి

బెజ్జూరు, మార్చి 5: మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తామని ఎంపీపీ రోజారమణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ రోజారమణి అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి సారి సమావేశానికి అధికారులు గైర్హాజరవుతు న్నారని ఇలా చేస్తే ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకునేది అని ప్రశ్నించారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీచేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోమారు అధికారులు గైర్హాజరైతే ఉపేక్షించేది లేదన్నారు. అనం తరం సమావేశంలో కొనసాగింది. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులు సమస్యలు వివరించగా అధికారులు సమధానాలిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ పుష్పలత, ఎంపీడీవో మాధవి, జడ్పీ సూపరింటెండెంట్‌ తోటాజీ, ఎంపీవోరమేష్‌రెడ్డి, ఏవో రాజులనాయుడు, మిషన్‌ భగీరథ డీఈ సిద్ధికి, ఏఈలు అభిలాష్‌, మక్బుల్‌ హుస్సేన్‌, పృధ్వీ పాల్గొన్నారు.

Read more