తర్లాపాడ్‌ అడవుల్లో ఎలుగుబంట్ల సంచారం

ABN , First Publish Date - 2022-04-24T07:20:05+05:30 IST

కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో నిత్యం ఎదో ఒక ప్రాంతంలో తరుచుగా శాఖాహార జంతువులైన జింకలు, కుందేళ్లు, దుప్పులు, నీలుగాయి లాంటి వన్యప్రాణులు కనిపించడం సహజమే...

తర్లాపాడ్‌ అడవుల్లో ఎలుగుబంట్ల సంచారం
తర్లాపాడ్‌ మక్కలకుంట ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంట్లు

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 23 : కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో నిత్యం ఎదో ఒక ప్రాంతంలో తరుచుగా శాఖాహార జంతువులైన జింకలు, కుందేళ్లు, దుప్పులు, నీలుగాయి లాంటి వన్యప్రాణులు కనిపించడం సహజమే... కానీ అరుదైన మాంసాహార జంతువులైన పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి లాంటివి సె ౖతం అప్పుడప్పుడు దర్శనమిస్తూ కవ్వాల్‌ అంటేనే వన్యప్రాణులకు అడ్డాగా ని రూపిస్తాయి. ఇలాంటి ఘటననే ఖానాపూర్‌ మండలంలోని తర్లాపాడ్‌ అడ వుల్లో చోటు చేసుకుంది. తర్లాపాడ్‌, సత్తన్‌పెల్లి అడవుల శివారులోని మక్కలకుంట ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు స్వేచ్చగా సంచరిస్తూ అటుగా వెళ్లినా గ్రామస్థులకు దర్శనమిచ్చాయి. దీంతో తమ అడవుల్లో ఎలుగుబంట్లు సంచరించడం పట్ల జంతుప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అడవులను ఆనుకుని ఉన్న పంటచేలలోకి రాత్రి, పగలు తాము వెళ్తుంటామని ఈ ఎలుగుబంట్లు పంట చేలకు సమీపంలోకి రాకుండా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని తర్లాపాడ్‌, సత్తన్‌పెల్లి, పాతతర్లాపాడ్‌ గ్రామాల రైతులు కోరుతున్నారు. 

Read more