కూలి డబ్బుల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-09-14T05:21:38+05:30 IST

ఉపాధి హమీలో పని చేసిన కూలీలకు ఆరు నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు రాకపోవడం లేదని గిరిజన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలి డబ్బుల కోసం ఎదురుచూపులు

ఉట్నూర్‌, సెప్టెంబరు 12: ఉపాధి హమీలో పని చేసిన కూలీలకు ఆరు నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు రాకపోవడం లేదని గిరిజన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఈజీఎస్‌ ఎపీవో రజనీకాంత్‌లను ఉపాధి హామీ కూలీలు కలిసి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. కూలి డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, వెంటనే ఇప్పించాలంటూ కూలీలు డిమాండ్‌ చేశారు. మండలంలోని చిన్న సుద్దగూడకు చెందిన 64 మంది కూలీలు, పెద్దసుద్దగూడకు చెందిన 150 మంది కూలీలు వేసవిలో చేసిన కంటూర్‌ కందకాల పనులకు అధికారులు డబ్బులు చెల్లించాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని హీరాపూర్‌, దొంగచింత, శ్యాంనాయక్‌ తండా, మారుగూడ, చింతకర్ర ప్రాంతాలలోని కూలీలందరికి కలిపి రూ.5 లక్షల వ రకు కూలి డబ్బులు రావాల్సి ఉందని తెలిపారు. వెంటనే డబ్బులు ఇప్పిం చాలంటూ ఆడ జంగుబాయి, ఆత్రం బాదిరావు, జుగునక జంగుబాయిలతో పాటు పలువురు కూలీలు కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు మాట్లాడుతూ ఏప్రిల్‌ మాసం నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తేవడంతో కొత్త గ్రామ పంచాయతీల పరిధిలో పని చేసిన కూలీలకు డబ్బులు రావడం లేదని, ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో మాట్లాడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ ఉన్నారు. 

Read more