బల్దియాలో వసూల్‌ దందా!

ABN , First Publish Date - 2022-12-16T01:10:15+05:30 IST

పట్టణాభివృద్ధికి పాటు పడాల్సిన బల్దియా నేతలే అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ అ ధికారులపై ఒ త్తిళ్లు చేస్తూ పంతం నెగ్గించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రస్థుతం ప ట్టణంలో రోడ్ల విస్తీర్ణం, ప్ర ధాన చౌక్‌ల ఆ ధునీకీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పాత నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణ, డివైడర్‌, సెంట్రల్‌ లై టింగ్‌, పట్టణానికి ముఖ ద్వారం, సెల్ఫీ పాయింట్‌ ఇతరాత్ర పనులు పూర్తయ్యాయి. ఎన్టీఆర్‌ చౌక్‌ నుంచి వినాయక్‌ చౌక్‌ వరకు మిగిలిన రోడ్డు విస్తర్ణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

బల్దియాలో వసూల్‌ దందా!

రోడ్డు పనులకు ఆటంకాలు

చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు

ఆదిలాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధికి పాటు పడాల్సిన బల్దియా నేతలే అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ అ ధికారులపై ఒ త్తిళ్లు చేస్తూ పంతం నెగ్గించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రస్థుతం ప ట్టణంలో రోడ్ల విస్తీర్ణం, ప్ర ధాన చౌక్‌ల ఆ ధునీకీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పాత నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణ, డివైడర్‌, సెంట్రల్‌ లై టింగ్‌, పట్టణానికి ముఖ ద్వారం, సెల్ఫీ పాయింట్‌ ఇతరాత్ర పనులు పూర్తయ్యాయి. ఎన్టీఆర్‌ చౌక్‌ నుంచి వినాయక్‌ చౌక్‌ వరకు మిగిలిన రోడ్డు విస్తర్ణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇ ప్పటికే బీటీ రోడ్డు పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ సెంట్రల్‌ డివైడర్‌ కోసం తవ్వకాలు చేపడుతుండగా బ ల్దియాకు చెందిన ఓ ద్వితీయ స్థాయి నేత అడ్డుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మల్టీపార్పస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ వె ళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయం టూ అడ్డుచెప్పడం గమనార్హం. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సూ చించాల్సిన బాధ్యత గల బల్దియా నేతనే ఎగ్జిబిషన్‌ యజమానుల ఒత్తిళ్లకు తలొగ్గినట్లు తెలుస్తోంది. ఇలా పట్టణంలో పలు అభివృద్ధి పనులు అర్ధాంతరంగానే నిలిచిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ పట్టణాభివృద్ధిని విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా పట్టణంలో కబ్జా చేస్తున్న రోడ్లు, ఖాళీ స్థలాలపై ఫిర్యాదులు చేసుకుంటూ అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అ ధికారులు ఎంత చెప్పిన వినిపించుకోక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. అభివృద్ధి పనుల్లో రాజకీయం జోక్యం పెరిగిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు విసుగెత్తి పోతున్నారు.

అడ్డాలు వేసి ఆపై వసూలు..

పట్టణంలో రోడ్లకు ఇరువైపుల ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తూ అడ్డాలు వేయడం కొందరు నేతలకు అలవాటుగానే మారింది. ఇదేదో చిరు వ్యాపారస్థులు కబ్జాలు చేస్తున్నారంటే పొరపాటే. స్వయంగా బల్దియా నేతలే రోడ్లకు ఇరువైపుల కబ్జాలు చేయడం తమ అనుచరులకు కేటా యిస్తూ వసూలు దందా కు ఎగబడుతున్నారన్న ఆరో పణలున్నాయి. పట్టణంలో ని రోడ్లకు ఇరువైపుల రా త్రికి రాత్రే అడ్డాలు వే యడం ఆపై చిరు వ్యాపారులకు అద్దెలకు ఇవ్వడం కొందరికి మా ములుగానే మారింది. రద్దీ ప్రదేశాల్లో ఒక్కో టేలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ప్రతినె లా వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్‌చౌక్‌ నుంచి వినాయకచౌక్‌ వరకు కొనసాగుతున్న రోడ్డును ఆనుకుని మలీఫార్పస్‌ గ్రౌండ్‌ పక్కన ముందస్తుగానే అడ్డాలను ఆపుకునేందుకు కొందరు నేతలు తోపుడుబండ్లను ఉంచినట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఇప్పటికే మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. కబ్జాల వ్యవహారంలో బల్దియా నేతలే తలదూర్చడం తో అధికారులు అడిగేందుకు జంకుతున్నారు. సాత్నాల క్వాటర్స్‌ ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని ఇప్పటికే కొందరు కబ్జా చేసిన అధికారులు మాములుగానే తీసుకుంటున్నారు. ఈ స్థలంపై గతంలోనే ఇరిగేషన్‌ అధికారులు అభ్యంతరాలు చెప్పిన పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇలా పట్టణంలో కబ్జాల బాగోతమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌చౌక్‌, వినాయక్‌చౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌లకు వెళ్లే ర హదారులకు ఇరువైపుల కబ్జాలు చేస్తూ అద్దె వసూల్‌కు ఎగబడుతున్నారు.

మాట వినకుంటే బెదిరింపులే..

బల్దియా నేతల మాట వినకుం టే అధికారులకు బెదిరింపులు తప్పడం లేదు. అసలే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ పట్టణవాసులు వాపోతున్నారు. పైగా బల్దియా నేతల బెదిరింపులతో పనులు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఓ మున్సిపల్‌ నేత సంబంధిత కాంట్రాక్టర్‌, అధికారులను బెదిరించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పట్టణంలోని పాత బస్టాండ్‌ మటన్‌ మార్కెట్‌ను ఆనుకొని ఉన్న స్థలంలో పనులు చేపడుతుండగా అడ్డుకోవడంతో ఇప్పటికీ అర్ధాంతరంగానే నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగడం లేదు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ నుంచి సాత్నాల బస్టాండ్‌ వైపు వచ్చే మార్గంలోని రోడ్డుకు ఇరువైపుల అక్రమం గా టేలాలు వేసి కబ్జా చేయడంతో రోడ్డు విస్తరణ పనులను నిలిపి వేశారు. ఇలాంటి ఇబ్బందులతో కొన్నిచోట్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న ఆశించిన స్థాయిలో పనులు జరుగక పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటుపడాల్సిన బల్దియా నేతలే పనులను అ డ్డుకోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

సురేష్‌ (ఆర్‌అండ్‌బీ డీఈ, ఆదిలాబాద్‌)

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న సెంట్రల్‌ డివైడర్‌ పనుల నిలుపుదల విషయం నా దృష్టికి రాలేదు. పరిశీలించి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాం. పనులు జాప్యం జరుగకుండా మరింత వేగవంతం చేస్తాం.

Updated Date - 2022-12-16T01:10:17+05:30 IST